సత్యనారాయణ హత్యను సుమోటోగా స్వీకరించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2019 5:14 PM ISTఅమరావతి: తొండంగి అర్బన్ ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణించింది. సత్యనారాయణ హత్యను సుమోటాగా తీసుకొని విచారణకు ఆదేశించారు జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్. సత్యనారాయణ హత్యకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం, డీజీపీకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శిలు చందూ జనార్ధన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి హత్యలు పత్రికా స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తాయన్నారు. తొండంగిలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టు సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు హత్యం విషయం తెలిసిందే.
Next Story