'ప్రతిరోజు పండగే' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 7:09 AM GMT
ప్రతిరోజు పండగే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ మధ్య కాలంలో 'చిత్రలహరి' చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ భారీ అంచనాలతో తెరకెక్కనున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. ఈ చిత్రానికి భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా గోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాత. గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్నఈ భారీ చిత్రం డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ ఆఫ్ ప్రతిరోజు పండగే కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేషాలు ముచ్చటగా ఉన్నాయి. తాత & మనవడు మధ్య రిలేషన్ ను ఈ సినిమాలో అందంగా చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.

Next Story
Share it