మెగా మేనల్లుడి కెరీర్ కు ప్రాణం పోసింది !

By రాణి  Published on  23 Dec 2019 7:49 PM IST
మెగా మేనల్లుడి కెరీర్ కు ప్రాణం పోసింది !

'బాలయ్య'తో పోటీ పడి మరీ తన సినిమాని విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్ కి మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బాగానే కలిసి వచ్చింది. 'చిత్రలహరి' ముందు వరకూ చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు' ఇలా తేజ్ సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌లే. దాంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోటీగా వచ్చి ఓవరాల్ గా హిట్ ను అందుకున్నాడు ఈ మెగా మేనల్లుడు.

కాగా మారుతి దర్శకుడిగా వచ్చిన 'ప్రతిరోజూ పండగే' బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో మొదలై ఇప్పటికీ 'ఏ' సెంటర్లలో గుడ్ కలెక్షన్లను సాధిస్తోంది. అటు బి.సి సెంటర్లలోనూ ఎబౌవ్ ఏవరేజ్ కలెక్షన్స్ తో రోజురోజుకు పుంజుకుంటుంది. మొత్తం మూడు రోజులకు గానూ రూ .8.63 కోట్ల థియేట్రికల్ షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. యూఎస్ లో కూడా $ 200 కె డాలర్స్ ను రాబట్టింది. దాంతో 'ప్రతిరోజూ పండగే'కు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఎలాగూ కిస్మస్ హాలీడేస్ ఉంటాయి కాబట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ సినిమా సాయి తేజ్ కెరీర్ కి ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక ఏరియా వారిగా చూసుకుంటే మొదటి మూడు రోజుల కలక్షన్ల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

నైజాంరూ. 3.70 కోట్లు
గుంటూరురూ.0.66 కోట్లు
నెల్లూరురూ.0.34 కోట్లు
ఈస్ట్రూ.0.69 కోట్లు
వెస్ట్రూ.0.52 కోట్లు
సీడెడ్ రూ.1.09 కోట్లు
ఉత్తరాంధ్ర రూ.1.04 కోట్లు
కృష్ణ రూ.0.62 కోట్లు

ఏపి & తెలంగాణలో మొదటి మూడు రోజుల కలెక్షన్స్ మొత్తం : రూ.8.63 కోట్లు

Next Story