తొలి అంధ ఐఏఎస్ అధికారిగా ప్రాంజల్ రికార్డు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2019 2:03 PM ISTతిరువనంతపురం: దేశంలోనే తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి ప్రాంజల్ పాటిల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్ పాటిల్ చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయింది. అయినా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగింది. 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాశారు. కాగా ప్రాంజల్ పాటిల్ సివిల్ సర్వీసెస్‌లో మొదటి ప్రయత్నంలోనే 773వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమెకు ఐఆర్‌ఏఎస్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు.
ప్రాంజల్ పాటిల్ మరో సారి యూపీఎస్సీ పరీక్షలు రాసి 124వ ర్యాంకు సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. కళ్లకు చేసిన శస్త్రిచికిత్స విఫలమైనందును తీవ్ర మనోవేదనకు గురయ్యానని ప్రాంజల్ తెలిపారు. సోమవారం తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా ప్రాంజల్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి.. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషి మనకు కావాల్సింది సాధించి పెడుతుందంటూ ప్రాంజల్ పిలుపునిచ్చారు.