పేద‌ల‌కు అండ‌గా ప్ర‌ణీత‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2020 12:16 PM IST
పేద‌ల‌కు అండ‌గా ప్ర‌ణీత‌

బాపు బొమ్మ అంటే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే హీరోయిన్ ప్ర‌ణీత‌. అందం, అభినయం ప్ర‌ణీత సొంతం. అయిన్ప‌టికి ఎందుక‌నో ప్ర‌ణీత హీరోయిన్‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. సెకండ్ హీరోయిన్‌కే ప‌రిమితం అయ్యింది. క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్‌లు లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమితం అయ్యింది. లాక్‌డౌన్‌ కార‌ణంగా ప‌ని లేక‌పోవ‌డంతో చాలా మంది సినీ కార్మికులు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.

సినీ కార్మికుల సంక్షేమం కోసం సినీ ఇండ‌స్ట్రీలోని ప‌లువురు త‌మ‌కు తోచిన విరాళాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా ప్ర‌ణీత త‌న వంతు సాయం చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమలోని 150మంది మేకప్‌, హెయిర్‌ స్టైలిస్టులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ మంచి పనిని ప్రారంభించిన సంయుక్తా హోర్నాడ్‌, నందుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

Next Story