సీఎంకు కాలితో షేక్ హ్యాండ్.. !

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 10:45 AM IST
సీఎంకు కాలితో షేక్ హ్యాండ్.. !

ఒక యువకుడు కేరళ సీఎంకు కాలితో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దానికి ఆనందపడిన సీఎం ఆ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇంత స్పెషల్‌గా చెప్పుకుంటున్న అబ్బాయి పేరు ప్రణవ్. పుట్టుకతోనే రెండు చేతులు లేని ప్రణవ్ కాళ్ళతోనే అద్భుత చిత్రాలను గీసే చిత్రకారుడిగా నిరూపించుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ఈ యువకుడు తన 21 వ పుట్టినరోజు సందర్భంగా తిరువనంతపురంలోని లెజిస్లేటివ్ కార్యాలయానికి వచ్చి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రూ.5 వేల రూపాయల చెక్కును అందజేశారు.

Img 20191113 053741

ఈ రోజు ఉదయం ఒక గొప్ప అనుభూతిని పొందానంటూ దీనికి సంబంధించిన ఫోటోలను విజయన్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ప్రణవ్‌ తన కాలుతో ఇచ్చిన సహాయ నిధి చెక్కును ముఖ్యమంత్రి అందుకోవడం, ప్రణవ్ కాలితో ముఖ్యమంత్రి హ్యాండ్ షేక్ చెయ్యటం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రణవ్ తాను భిన్నంగా జన్మించాను కాబట్టి భిన్నంగా ఆలోచిస్తానన్నాడు.

తాజాగా ఒక రియాలిటీ షోలో కొంత మొత్తాన్ని గెలుచుకున్న ప్రణవ్ దానిని సీఎం సహాయనిధికి అందజేశాడు. పేద కుటుంబం కావడంవల్ల పుట్టినప్పటి నుంచి ఒక పుట్టినరోజు కూడా జరుపుకోలేదని, సీఎం సహాయనిధి కి తన చెక్కు అందించడం ద్వారా వెయ్యి కేకులు తిన్నంత ఆనందంగా ఉందన్నాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రణబ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఐదు వేల రూపాయల చెక్కును సీఎం సహాయనిధి అందజేశారు. తనకున్న లోపాన్ని పక్కనపెట్టి చిత్రకారుడిగా ఎదగడమే కాదు, ఎదుటి వారికి ఎంతోకొంత సహాయాన్ని కూడా అందించాలి అన్న ప్రణవ్ ను మెచ్చుకుని తీరాల్సిందే.



Next Story