దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తన రాజకీయ జీవితంలో ఎంతో గుర్తింపు లభించింది. సాధారణ క్లర్క్‌ ఉద్యోగం నుంచి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరకు అంచెలంచెలుగా ఎదిగారు.1935 డిసెంబర్‌ 11న పశ్చిమబెంగాల్‌లోని బీర్‌భమ్‌ జిల్లాలో మిరాటీ గ్రామంలో జర్మించారు. 80 దశాబ్దాల జీవితంలో 50 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు.

ప్రణబ్‌ ముఖ్యమైన ఘట్టాలు (1935-2020):
పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏఅండ్‌ కలకల్తా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ
1963లో విద్యానగర్‌ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకుడిగా తన కెరీర్‌ ప్రారంభం
1969లో రాజ్యసభ సభ్యుడిగా నియామకం
1973-1974: కేంద్ర పరిశ్రమల అభివృద్ధి మంత్రిగా
1974: కేంద్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు
1974-75: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా
1975-77: కేంద్ర రెవెన్యూ, బ్యాకింగ్‌ మంత్రిగా
1978-79: ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారిగా బాధ్యతలు
1980-82: కేంద్ర వాణిజ్య, ఉక్కు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు
1980-85: రాజ్యసభ నాయకుడిగా
1982-85: అంతర్జాతీయ ద్రవ్య నిధి గవర్నర్ల బోర్డు
1984: కేంద్ర వాణిజ్య మంత్రిగా
1984,91,96,98 : కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా
1984, 2009-12 : గ్రూప్‌ ఆఫ్‌ 24కు చైర్మన్‌ (ఐఎంఎఫ్‌ ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన మంత్రుల వర్గం)
1985,2000-10: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా
1961-96 : ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌గా
1993-95 : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా
1993-96 : విదేశీ వ్యవహారాల శాఖ, కేంద్ర మంత్రిగా
1995 : సార్క్‌ కౌన్సిల్‌ ఆప్‌ మినిస్టర్స్‌కు అధ్యక్షుడిగా బాధ్యతలు
1998-99 : ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీగా
1999-2012 : సెంట్రల్‌ ఎన్నికలు కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా
2004-2012 : లోక్‌ సభ నాయుడిగా
2004-06 : కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు
2006-09 : విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా
2008 : పద్మవిభూషణ్‌ అవార్డు స్వీకరణ
2009-2012 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా
2012 జూలై 25-2017 జూలై 25 వరకు భారత 13వ రాష్టపతిగా బాధ్యతలు
2019 :భారత అత్యున్నత పౌర పురస్కారం
ఆగస్టు 10, 2020 : కరోనా పాజిటివ్‌ నిర్ధారణ
ఆగస్టు 13, 2020 మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెళ్లిన ప్రణబ్‌
ఆగస్టు 31, 2020 : ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూత

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.