బిగ్‌బ్రేకింగ్: విద్యుత్ స్తంభం ఢీకొన్న ట్రాక్టర్.. 11 మంది కూలీలు మృతి
By సుభాష్ Published on 14 May 2020 7:44 PM ISTవిద్యుత్ స్థంభమే వ్యవసాయ కూలీలకు శాపంగా మారింది. ఉదయం కూలీ పనులకు వెళ్లి కూలీలు అడుతూ పాడుతూ పనులు చేసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా కరెంటు తీగల రూపంలో మృత్యువును వెంటాడింది. ట్రాక్టర్‌లో నవ్వులు.. ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వస్తుండగా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో నాగులుప్పలపాడు మండలం మాచవరంలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్నిఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు ట్రాక్టర్‌పై పడటంతో 11 కూలీలు మృతి చెందారు. కూలీలంతా నాగులప్పపాడు, మాచవరం మండలానికి చెందిన వ్యవసాయ రైతులుగా గుర్తించారు. మృతుల్లో 7 మహిళలు, మిగతా వారు పురుషులున్నట్లు తెలుస్తోంది. కూలీలంతా వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ట్రాక్టర్‌లో 20 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. ఇంకొందరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.