ప్ర‌భాస్ తో శంక‌ర్ సినిమా..?

By Newsmeter.Network  Published on  10 Dec 2019 6:56 AM GMT
ప్ర‌భాస్ తో శంక‌ర్ సినిమా..?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా టాలీవుడ్ లో స‌క్స‌స్ కాక‌పోయినా బాలీవుడ్ లో మాత్రం సక్స‌స్ అవ్వ‌డంతో ప్ర‌భాస్ ఇక నుంచి త‌ను న‌టించే సినిమాల క‌థ‌ల విష‌యంలో మ‌రింత కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే రాధాకృష్ణ కుమార్ తో చేస్తున్న సినిమా క‌థ పై మ‌రోసారి క‌స‌రత్తు చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌.

ఇదిలా ఉంటే... రాధాకృష్ణ కుమార్ తో చేస్తున్న సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల సైరా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి క‌థ చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ క‌థ పై ప్ర‌భాస్ ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. తాజా వార్త ఏంటంటే... గ్రేట్ డైరెక్ట‌ర్ ప్ర‌భాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నార‌ట‌. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమాని అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.

శంక‌ర్ తెర‌కెక్కించే భార‌తీయుడు 2 సినిమాని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు కానీ.. కానీ లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందే భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ శంక‌ర్, ప్ర‌భాస్ కి క‌థ చెప్పార‌ట‌. ప్ర‌భాస్ సానుకూలంగానే స్పందించార‌ని తెలిసింది. త్వ‌ర‌లో ఈ సంచ‌ల‌న చిత్రాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Next Story
Share it