తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న సంగతి తెలిసిందే. గోపికృష్ణా మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన కే.కే రాధాకృష్ణ దర్శకుడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవలే లండన్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో బాహుబలి-1 చిత్రాన్ని హిందీలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. 148 ఏళ్ల ఆల్బర్ట్‌ హాల్‌ చరిత్రలో ఇంగ్లీష్‌ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రభాస్ కూడా పాల్గొన్నారు. ప్రభాస్ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక హైదరాబాద్‌లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీనికోసం భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్‌లో జరిగే షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటారు. రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు.

బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు రావడంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బిల్లా తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని గ్రాండియర్ ప్రొడక్షన్స్ వాల్యూస్‌తో నిర్మించనున్నారు.

టెక్నీకల్‌గా హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస… ప్రొడక్షన్ డిజైనింగ్ లో నూతన ఒరబడి సృష్టించిన రవీందర్…. తనదైన షార్ప్ ఎడిటింగ్‌తో ఎన్నో అద్భుతమైన హిట్స్‌లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం విశేషం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉండనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort