ప్రభాస్.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2019 9:45 AM GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈసారి ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకునే సినిమాతో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'సాహో' రిజల్ట్ తర్వాత రాధాకృష్ణను పిలిచి కథ పై మరోసారి కసరత్తు చేయమన్నాడట.
ప్రస్తుతం రాధాకృష్ణ అదే పనిలో ఉన్నాడు. నవంబర్ నుంచి తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ప్రభాస్ నిన్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివని కలిసాడట. వీరిద్దరి మధ్య సినిమాకి సంబంధించి కథా చర్చలు జరిగాయని.. కొరటాల చెప్పిన లైన్‌కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మిర్చి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే... అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని సమాచారం.