‘సైరా’ సినిమాతో సురేంద‌ర్ రెడ్డి సూప‌ర్.. అనిపించుకున్నాడు. సురేంద‌ర్ రెడ్డికి అప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలను స్టైలీష్ గా తెర‌కెక్కించ‌డం తెలుసు. అందుక‌నే అతన్నీ స్టైలీష్ డైరెక్ట‌ర్ అంటారు. అయితే… మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరాకి సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట‌ర్ అని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు అంద‌రిలో ఒక‌టే అనుమానం. సురేంద‌రెడ్డి అంత పెద్ద సినిమాని అంద‌రూ మెచ్చేలా తెర‌కెక్కించ‌గ‌ల‌డా..?  అని. అయితే.. అంద‌రి అనుమానాల‌ను ప‌టాపంచ్ లు చేసి.. సైరా అద్భుతం అనేలా తెర‌కెక్కించాడు.

దీంతో సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల సురేంద‌ర్ రెడ్డి నెక్ట్స్ మూవీ యువ హీరో నితిన్ తో అని వార్త‌లు వ‌చ్చాయి కానీ… అదంతా అవాస్త‌వం అని తెలిసింది. మ‌రి.. అది అవాస్త‌వం అయితే.. సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో ఉంటుంది అని ఆరా తీస్తే… బాహుబ‌లి ప్ర‌భాస్ తో సురేంద‌ర్ రెడ్డి సినిమా ఉంటుంద‌ని తెలిసింది. ప్ర‌భాస్ తో సురేంద‌ర్ రెడ్డి జేమ్స్ బాండ్ త‌ర‌హా సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

ప్ర‌భాస్ కి స‌రిప‌డా స్టోరీ లైన్ రెడీ చేసాడ‌ట‌. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ కి స్టోరీ లైన్ వినిపిస్తాడ‌ట‌. అయితే… ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ తో ‘జాను’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని గోపీకృష్ణా మూవీస్, యు.వి. క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా దాదాపు 25% షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే… ప్ర‌భాస్ – సురేంద‌ర్ రెడ్డి సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రంలో సెట్స్ పైకి వెళ్ల‌చ్చు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.