ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2020 1:14 PM GMT
ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

'బాహుబలి' చిత్రంతో పాన్‌ ఇండియా రేంజ్‌కి ఎదిగాడు రెబర్‌ స్టార్‌ ప్రభాస్. డార్లింగ్‌ సేవా గుణం అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో సీఎం, పీఎం సహాయ నిధికి భారీ విరాళం ఇచ్చారు ప్రభాస్‌. తాజాగా ఖాజీపల్లి అర్భన్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న డార్లింగ్‌ ఆ ప్రాంత అభివృద్ది కోసం రూ. 2కోట్లు అందించారు.

Prabhas Adopts Khajipalle Urban Forest

ఇటీవలే గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ ఓ 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఖాజీపల్లి అర్బన్ బ్లాక్ ను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ లు పాల్గొన్నారు. ఈ ఫారెస్ట్ రిజర్వ్ భూమిని ప్రభాస్ తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు పేరుమీద అర్బన్ పార్క్, అటవీప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రభాస్‌ తెలిపారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.

Next Story