చెమటను కూడా తుడుచుకోలేని పరిస్థితి
By తోట వంశీ కుమార్ Published on 30 Sept 2020 8:00 PM ISTలాక్‌డౌన్‌తో దాదాపు ఆరు నెలలు షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. కాగా.. సినీ నటి మీనా దాదాపు ఏడు నెలల తర్వాత విమాన ప్రయాణం చేశారు. దృశ్యం 2 చిత్ర షూటింగ్ కోసం చెన్నై నుంచి కేరళకు వెళ్లారు. పీపీఈ కిట్ ధరించి ఆమె ప్రయాణించారు. తన ప్రయాణానికి సంబంధించిన అనుభవాలు, ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
పీపీఈ కిట్లు ధరిస్తే.. ఏదో యుద్ధానికి వెళ్తున్న భావన తనకు కలిగిందని మీనా చెప్పింది. ఏడు నెలల తర్వాత ప్రయాణం చేశానని.. విమానాశ్రయ పరిసరాలన్నీ వెలవెలబోయి ఉన్నాయని, పరిసరాలు నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. అయితే చాలా మంది తనలా పీపీఈ కిట్లు ధరించకుండానే వచ్చారని కాగా.. ఈ కిట్లను ధరించడం చాలా అసౌకర్యవంతంగా ఉందన్నారు. చాలా ఉక్కపోతగా, చికాకుగా అనిపించిందని తెలిపారు. చల్లటి వాతావరణం ఉన్నా చెమటలు పట్టాయన్నారు. చేతికి గ్లౌజులు ధరించడం వల్ల ముఖానికి పట్టిన చెమటను కూడా తుడుచుకోలేని పరిస్థితిని ఉందని చెప్పుకొచ్చారు. పీపీఈ కిట్లు ధరించి వైద్య సేవలు చేస్తున్న డాక్టర్లు హ్యాట్సాఫ్ చెప్పారు. వైద్యులపై ఇంకా గౌరవం పెరిగిందని.. మానవత్వంతో మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు అని మీనా ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.