ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ వాయిదా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2019 4:01 PM ISTహైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం గాలి జనార్ధన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రాజగోపాల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఓఎంసీ కేసులో తదుపరి దర్యాప్తుపై కోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది. ఇవాళ విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
అయితే ఓఏంసీ కేసును విశాఖకు బదీలి చేయవద్దని, హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే విచారణ జరపాలని కోరింది. లీజుల కేటాయింపు, అక్రమాల కుట్ర ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగిందని నివేదించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు హైదరాబాద్‌లోనే ఉంది నేరాలకు పాల్పడ్డారని తెలిపింది. కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు మార్చిన సంగతి మనకు తెలిసిందే..
Next Story