'తేరి మెహర్భానియా' కు తెలుగు రీమేక్‌ ఇదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 7:06 AM GMT
తేరి మెహర్భానియా కు తెలుగు రీమేక్‌ ఇదే..!

' కె.సి.బొకాడియా' చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌ పేరు. ఎంద‌రో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. ఈయన గతంలో నిర్మించిన 'తేరి మెహర్భానియా' చిత్రానికి పార్ట్‌-2 గా ఈ చిత్రాన్ని తీస్తున్నారు.

అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా ఆయన తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి. బొకాడియా ..విలేకరుల సమావేశంలో మట్లాడారు. మాది రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం, మా నాన్న గారు ఒక్కసినిమా కూడా చూడలేదు.

అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్‌ కుమార్‌తో 'రివాజ్' సినిమాను నిర్మించానన్నారు. 1985లో 'ప్యార్‌ జుక్తా నహి' విడుదలైన అన్ని భాషలలో సిల్వర్‌ జూబ్లీ చేసుకుందన్నారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద ‘బి.ఎం.బి’ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి నిర్మించిన 'తేరి మెహర్భానియా' మంచి హిట్‌ ఇచ్చిందన్నారు.

ఈ తరువాత మా ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. ఆ తరువాత నా డైరెక్షన్‌లో అమితాబ్‌ హీరోగా ‘ఆజ్‌ కాఅర్జున్‌’ సినిమా వచ్చి గొప్ప విజయం సాధించింది.

తరువాతజినీకాంత్‌తో 5 సినిమాలకు వర్క్‌ చేశానన్నారు. ప్రియాంక చోప్రాని హీరోయిన్‌గా పరిచయం చేసింది తానేనని ఈ సందర్భంగా చెప్పారు. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. అయితే ఇప్పుడు 'నమస్తే నేస్తమా' నా ఫస్ట్‌ తెలుగు మూవీ. అలాగే నాకు చాలా ఇష్టమైన మూవీ. ‘తేరి మెహర్భానియా’ ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్‌ అవుతుంది అనుకుంటున్నాను అని అన్నారు.

Next Story