'పూజా హెగ్డే'కి బంపర్ ఆఫర్.. అందుకే ఎడ్జెస్ట్ అయిందట.!

By అంజి  Published on  28 Jan 2020 11:36 AM GMT
పూజా హెగ్డేకి బంపర్ ఆఫర్.. అందుకే ఎడ్జెస్ట్ అయిందట.!

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అనగానే గుర్తొచ్చే పేరు 'పూజా హెగ్డే'దే. రీసెంట్ గా 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. పైగా ప్రభాస్ కు జోడీగా 'జాన్' సినిమాలో కూడా నటిస్తోంది. ఇంకా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాతో పాటు పలువురు స్టార్ హీరోలతో కూడా ఈ అమ్మడు ఈ సంవత్సరంలో నటించే ఛాన్స్ ఉంది. ఒక వైపు టాలీవుడ్ లో వరుసగా పెద్ద స్టార్స్ తో నటిస్తూనే మరో వైపు బాలీవుడ్ వైపు కూడా తొంగి చూస్తోంది.

ఇప్పటికే ఈ టాల్ బ్యూటీకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న 'బచ్చన్ పాండీ' సినిమాలో ఛాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా ఈ అమ్మడునటిస్తుందనుకున్నారు అందరూ. అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 'పూజా హెగ్డే'ది కూడా మెయిన్ రోల్ నేట. కృతి సనన్ కంటే పూజా హెగ్డేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందట. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ప్రస్తుతం చాలా సక్సెస్ ఫుల్ స్టార్ గా ఉన్నాడు. అలాంటి హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే.. బంపర్ ఆఫరే.. ఏమైనా అదృష్టం అంటే 'పూజా హెగ్డే'దే.

అందుకే అక్షయ్ కుమార్ సినిమా అనగానే 'పూజా హెగ్డే' డేట్లు ఎడ్జెస్ట్ కాకపోయినా వెంటనే సర్దుబాటు చేసుకుని మరి డేట్లు ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూనే ఉంది. త్వరలోనే పూజా అక్షయ్ తో పాటు షూట్ లో పాల్గొనబోతుంది. పూజా హెగ్డే బాలీవుడ్ లో మొదటి నుండి కూడా స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ సినిమాతోనైనా బాలీవుడ్ తో ఈ బ్యూటీ జెండా పాతుందో లేదో చూడాలి.

Next Story
Share it