నవ్వులు పూయిస్తున్న అంకుల్.. పూజాతో సెల్ఫీ కోసం నానా తంటాలు..
By న్యూస్‌మీటర్ తెలుగు
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మొన్ననే అల.. వైకుంఠపురములో సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరు చలామణి అవుతూ ఉంది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్‌గా ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది. అది చూసిన అభిమానులు వూరికే ఉండరు కదా? పూజాతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
అయితే.. ఓ అంకుల్ మాత్రం పూజాతో సెల్ఫీ దిగడానికి తాను చూపిన ఉత్సాహం, తాపత్రయం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. చూసిన ప్రతి ఒక్కరిలో నవ్వులు పూయిస్తుంది. వివరాళ్లోకెళ్తే.. ముంబయి ఎయిర్‌పోర్టు నుండి బయటకు వస్తున్న పూజను ఫొటోగ్రాఫర్స్ ఫొటోలు తీస్తుండగా.. అది చూసిన ఓ అంకుల్ ఆమెతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు.
పూజా కూడా అంకుల్‌కు సెల్ఫీ ఇవ్వడం కోసం కొద్ది క్షణాలు ఆగింది. పూజ ఎత్తు ఉండటమో లేక ఆ అంకుల్‌కు ఫోన్ పట్టుకోవడం చేతకాకనో.. లేక అందాల తార పక్కన ఉందనో ఏమో సెల్ఫీ మాత్రం రాలేదు. ఆ సన్నివేశం చూసిన పూజా నవ్వు ఆపుకోలేకపోయింది. అంకుల్ కంటే వెనకొచ్చిన వారు కూడా పూజాతో సెల్ఫీ దిగారు. కానీ అంకుల్ మాత్రం నాన ఇబ్బందులు పడ్డాడు. ఏమైతేనేం ఆఖరికి సాధించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.