ఇండో -బంగ్లా టీ20 జరుగుతుందా? జరగదా..?!
By న్యూస్‌మీటర్ తెలుగు
ఢిల్లీ: ఢిల్లీ: టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫస్ట్ టీ20 మ్యాచ్‌పై వాయు కాలుష్యం ప్రబావం చూపే అవకాశముంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫస్ట్ టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. తొలి మ్యాచ్‌లోనే ఆటగాళ్లు వాయు కాలుష్యం బారిన పడతారేమోనని డీడీసీఏ కలవ పడుతుంది. వేదికను మార్చాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో చేయలేరు. ఇప్పటికే గంగూలీ మీడియాతో మాట్లాడుతూ..మ్యాచ్ వేదికను మార్చే ఉద్దేశం లేదన్నాడు. ఇప్పటికే క్రికెటర్లు ప్రాక్టీస్ చేసే క్రమంలో ముఖానికి పొల్యూషన్ మాస్క్‌లు ధరిస్తున్నారు.
ఢిల్లీలో క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడటం ఫస్ట్ టైం కాదు. గతంలో శ్రీలంక క్రికెటర్లు సైతం ఇదే తరహాలు ఇబ్బందులు పడ్డారు. 2017లో దీని ప్రభావాన్ని తట్టుకోలేని కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు కూడా చేసుకున్నారు. మరికొంత మంది అస్వస్థతకు లోనయ్యారు. అది టెస్టు మ్యాచ్ కావడంతో లంక క్రికెటర్లు ఐదు రోజుల పాటు వాయు కాలుష్య బాధను అనుభవించారు.
ఈ మ్యాచ్ బీసీసీఐకి సవాల్‌తో కూడుకున్నదనే చెప్పాలి. ఒకవేళ అనుకూలంగా ఉంటే మాత్రం మ్యాచ్ జరుగుతుంది. కాలుష్యం ఎక్కువైతే..అప్పటికప్పుడు మ్యాచ్ రిఫరీ, అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు.