మహారాష్ట్ర: నందూర్బార్ జిల్లా మనిబేలి గ్రామస్తులు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. ఈ గ్రామంలో కేవలం 135 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. తమ గ్రామానికి కరెంట్, రోడ్డు లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ మనిబేలి గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. కరెంట్ , రోడ్డు కావాలంటూ అధికారులు చుట్టూ తిరిగి అలసి పోయామని మనిబేలి గ్రామస్తులు చెప్పారు. ఇక తిరగలేక ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే..8 ఏళ్ల క్రితం రోడ్డు ఓకే అయిందని..కాగితాలకే దానిని పరిమితం చేశారని గ్రామస్తులు వాపోయారు. అడవి ప్రాంతం ఎక్కువుగా ఉండటంతో అధికారులు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.