చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల్లో స్పందన లేదు: మాజీమంత్రి అనిల్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది అని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ అన్నారు

By Srikanth Gundamalla  Published on  10 Sep 2023 6:11 AM GMT
YCP, Anil kumar yadav,  Chandrababu Arrest,

 చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల్లో స్పందన లేదు: మాజీమంత్రి అనిల్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది అని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు ముద్దాయి అని ఆయన పేర్కొన్నారు. తన దగ్గర ఏమీ లేదు అని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చింది ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చుకున్నారంటూ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిపై కేసు నమోదు అయితే.. అక్రమ కేసు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సరికాదంటూ అనిల్‌ కుమార్ యాదవ్ చెప్పారు. అయితే.. చంద్రబాబు ఆదేశాల మేరకే స్కిల్‌డెవలప్‌మెంట్‌ నిధులు విడుదల చేశారని మాజీ మంత్రి అనిల్ యాదవ్ అన్నారు. అక్రమాలకు పాల్పడితే అరెస్ట్‌ చేయొద్దా అని ప్రశ్నించారు.

అయితే.. చంద్రబాబుని అరెస్ట్‌ చేస్తే ప్రజల్లో పెద్దగా స్పందనేమీ లేదన్నారు మాజీమంత్రి అనిల్. ప్రజల్లో స్పందన లేకపోవడంతోనే దత్తపుత్రుడు పవన్‌ను తీసుకొచ్చి హంగామా చేసే ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణలు చేశారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కాం కేసు ఒక్కటే కాదు.. ఇంకా అమరావతి, ఆదాయ పన్ను అక్రమాలు ఉన్నాయని, అవి కూడా బయటకు వస్తాయని మాజీమంత్రి అనిల్ అన్నారు. అక్రమాల కేసుల్లో పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత అధికారులు కేసు నమోదు చేశారని ఈసందర్భంగా చెప్పారు. అయితే.. ఏ స్థాయిలో ఉన్నా తప్పు చేస్తే కేసులు తప్పవని తమ ప్రభుత్వం నిరూపించిందని తెలిపారు. తప్పులు చేసిన చంద్రబాబుని అరెస్ట్‌ చేస్తే టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు తప్పులు చేసినా.. వదిలేది లేదని మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు.

Next Story