సీఎం కేసీఆర్ సమక్షంలో BRSలో చేరిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి

నాగం జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 8:41 AM GMT
vishnuvardhan reddy, joined  brs, cm kcr, telangana bhavan,

సీఎం కేసీఆర్ సమక్షంలో BRSలో చేరిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి

తెలంగాణలో ఎన్నికల వేళ పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. కొందరు అధిష్టానంపై అసంతృప్తితో పార్టీని వీడుతుంటే.. ఇంకొందరు టికెట్‌ ఆశించి లభించకపోవడం.. పార్టీలో గౌరవం లేదని ఇంకొందరు పార్టీలు మారుతున్నారు. తాజాగా సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. వీరిద్దరితో పాటు వారి అనుచరులు కూడా పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ వీరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇంకానెళ్లో కొనసాగదని విష్ణువర్ధన్‌రెడ్డి అన్న వియం తెలిసిందే. త్వరలో ప్రస్తుతం ఉన్న నేతలు గాంధీభవన్‌ను కూడా అమ్మేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ చైనాకో.. అమెరికాకో అగ్గువకే అమ్మేస్తారంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తన తండ్రి పీజేఆర్‌, ఆ తరువాత తాను ఎన్నో ఏండ్లు సేవలందించామన్నారు. కానీ.. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డబ్బులకు అమ్ముడు పోయి తమకు అన్యాయం చేశారంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నుంచి జూబ్లీహిల్స్ టికెట్‌ తనకే వస్తుందని భావించిన విష్ణువర్ధన్‌రెడ్డి.. రెండో జాబితాలో తనకు బదులు అజారుద్దీన్‌కు కేటాయించడంతో మనస్తాపం చెందారు. దాంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ నాగం జనార్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డిని బీఆర్ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి తోడుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. విష్ణురెడ్డి భవిష్యత్‌పై తాను భరోసా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. నాగం జనార్ధర్‌రెడ్డితో కలిసి తాను అనేక పోరాటాలు చేశానని గుర్తు చేశార. జూబ్లీహిల్స్‌లో పాత, కొత్త నేతలు అందరూ కలిసి పని చేయాలన్నారు. అలాగే ఈ సారి పాలమూరులో 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.

Next Story