డీఎంకే నుండి టీఆర్ఎస్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందా..?

Opinion what TRS wants to learn from DMK.20వ వార్షికోత్సవ వేడుకలను టీఆర్‌ఎస్ ఇటీవలే పూర్తీ చేసుకుంది.

By M.S.R  Published on  29 Oct 2021 1:00 PM GMT
డీఎంకే నుండి టీఆర్ఎస్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందా..?

20వ వార్షికోత్సవ వేడుకలను టీఆర్‌ఎస్ ఇటీవలే పూర్తీ చేసుకుంది. ఈ వేడుకల సమయంలో నాయకత్వం మేల్కొన్నట్లు తెలుస్తోంది. కొత్త రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీ రామారావు సీనియర్ నాయకులతో కలిసి తమిళనాడులో పర్యటించనున్నట్లు ప్రకటించారు. డీఎంకే(DMK) మరియు అన్నా డీఎంకే (AIADMK) యొక్క రాజకీయ నమూనాలను, సంస్థాగత నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి తమిళనాడుకు వెళ్లనున్నారు. "డీఎంకే నిర్మాణంలో కొన్ని అంశాలను నేను ఖచ్చితంగా టిఆర్ఎస్‌లో చేర్చాలనుకుంటున్నాను. ఉదాహరణకు ప్రతి గ్రామంలో వారికి పార్టీ కార్యాలయం ఉంది. కార్యకర్తలు పార్టీకి ఎంతో విధేయులుగా కొన్నేళ్ల పాటూ ఉంటున్నారు. వారి జీవిత కాలం మొత్తం పార్టీ కోసమే జీవించేవారు. అలాగే తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎదుగుదల చూడాలని కోరుకుంటున్నాం'' అని మీడియాతో అన్నారు.

కేటీఆర్ ఎందుకు ద్రావిడ మోడల్ ను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు..?

ఉచితాల ప్రకటనలను మినహాయిస్తే టీఆర్‌ఎస్‌.. ద్రవిడ పార్టీల మధ్య అంతగా పొంతన లేదు. బ్రాహ్మణ ఆధిపత్యం నేపథ్యంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం సైద్ధాంతికంగా డీఎంకే నిలబడింది. తమిళ గుర్తింపుకు ముప్పుగా ఉన్న హిందీని వ్యతిరేకించింది. ఈ సమస్యలపై టీఆర్‌ఎస్‌ ఎక్కడా పోటీకి నిలబడలేదు. అలాంటప్పుడు తమిళ పార్టీలను చూసి టీఆర్‌ఎస్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నది?

కేటీఆర్ ప్రకటన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ని తన సొంత మోడల్ కంటే మెరుగైన మోడల్ కోసం ముందుకు వెళుతోంది. అదే ఎందుకు..? అనే ఆసక్తికర చర్చకు తెరలేపింది. తమిళనాడులో బీజేపీ ప్రవేశాన్ని ఎలా అడ్డుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి టీఆర్‌ఎస్‌కు ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ ఎదుగుదల టీఆర్‌ఎస్‌ను కలవరపెడుతోందా..?

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీ ముప్పుగా భావిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. బీజేపీని అడ్డుకోవడం కోసం.. ఆ పరిష్కారం కోసం టీఆర్‌ఎస్ నాయకులు దక్షిణాది వైపు చూసేలా రెండు అంశాలు బలవంతం చేసి ఉండవచ్చు.

"ఒకటి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందగా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలం గడుస్తున్న కొద్దీ ఆదరణ లేకుండా పోతోంది. అందుకు కారణం ఏంటి?.. రెండవది... టీఆర్ఎస్ ద్రవిడ ప్రాంతీయవాదం వంటి రాజకీయాలను ఆచరించాలని యోచిస్తోంది. ఈ ప్రాంతీయ, జాతి, భాష, సాంస్కృతిక గుర్తింపు క్లుప్తంగా తమిళ ఐడెంటిటీ తమిళనాడులోకి ప్రవేశించడానికి బీజేపీకి ప్రధాన అడ్డంకి. కానీ, తెలంగాణలో తమిళ మోడల్ పనిచేయదు, "అని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత నమూనా ఉందని, వాటిని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయలేమని అన్నారు.

తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ఎం కోదండరామ్ ప్రకారం.. ఇటీవలి కాలంలో మూడు అంశాలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని కొత్త మోడల్ కోసం వెతకడానికి బలవంతం చేస్తున్నాయని అన్నారు. ''కాంగ్రెస్, బీజేపీ, సామాజిక ఒత్తిడి వంటి కొత్త అంశాలు" అని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త నాయకత్వం కారణంగా సజీవంగా మారింది. అదే విధంగా, బీజేపీ కూడా దూకుడుగా ఉంది. తొలిసారిగా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంపై చర్చ జరుగుతోంది'' అని కోదండరామ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్ నాయకత్వ రాజకీయాల అప్రజాస్వామిక అంశాల కారణంగా బీజేపీ ప్రవేశానికి తెలంగాణ ద్వారాలను విస్తృతంగా తెరిచాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త కె శ్రీనివాసులు అంగీకరించారు. ఉస్మానియా యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకత్వంలోని అన్ని వ్యతిరేక స్వరాలను తుడిచిపెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని అన్నారు. రాజకీయ శూన్యత ఎప్పుడూ సమూల మార్పులకు కారణమవుతుందని, తెలంగాణ ఇప్పుడు అలాంటి శూన్యతను అనుభవిస్తోందని ప్రొఫెసర్ శ్రీనివాసులు అన్నారు.

''సొంత జేఏసీలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, గల్ఫ్ వలసదారులు, ఉద్యోగులు తదితర భిన్నాభిప్రాయాలకు స్థానం కల్పించే బదులు.. ఫిరాయింపులను ప్రోత్సహించి విపక్షం-ముక్త్ తెలంగాణ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ ఒక సాధారణ రాజకీయ పార్టీలా పనిచేస్తుందని కేసీఆర్ ప్రకటించడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరులో మార్పునకు నిదర్శనం. పాలనలో వారి ఆకాంక్షలు ప్రతిబింబించనప్పుడు, ప్రజలు వారి భావజాలంతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయాల కోసం చూస్తారు. తెలంగాణలో ఏం జరుగుతుందో బీజేపీ పసిగట్టినట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తమను తాము నిలబెట్టుకునేందుకు కాషాయ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, భాజపా ముప్పు నుంచి గట్టెక్కేందుకు ద్రవిడ పార్టీలు ఏదో ఒక పరిష్కారాన్ని అందించవచ్చని టీఆర్‌ఎస్ నాయకత్వం ఆలోచిస్తోంది.

Next Story