రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్ అవుతాం: నారా లోకేశ్
రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్ అవుతాం: నారా లోకేశ్
రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇదే అంశంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. రాజకీయంగా గల్లా జయదేవ్‌ను తాము మిస్ అవుతామని అన్నారు లోకేశ్. రాజకీయాలకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తాత్కాలికంగా విరామం ప్రకటించారు... ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కీతజ్ఞతాభివందనం సభలో లోకేశ్ మాట్లాడారు. అమరావతి రైతుల తరఫున గల్లా జయదేవ్ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన తిరిగి వస్తే టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేశ్ అన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏరోజు కూడా కంపెనీల జోలికి వెళ్లలేదని నారా లోకేశ్ అన్నారు. రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు. వైసీపీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గుంటూరు టికెట్ ఎవరైనా వదులుకుంటారా? కానీ.. గల్లా జయదేవ్ వదులుకున్నారని చెప్పారు. పార్టీ మారే అలవాటు తమ వంశంలోనే లేదని చెప్పారు. రాజకీయాలకు తాత్కాలికంగా మాత్రమే దూరమవుతున్నట్లు గల్లా జయదేవ్ చెప్పారని అన్నారను. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం గల్లా జయదేవ్ సహాకరం ఎప్పుడూ అందిస్తారని ఆశిస్తున్నట్లు లోకేశ్ అన్నారు.