ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బుని చూడలేదు..మల్లారెడ్డి సంచలన కామెంట్స్

మరోసారి మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని అన్నారు.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2023 9:07 AM GMT
Minister Malla Reddy, Hot Comments, IT Raids,

ఐటీ అధికారులు నా ఇంట్లో డబ్బుని చూడలేదు..మల్లారెడ్డి సంచలన కామెంట్స్

మంత్రి మల్లారెడ్డి అంటేనే వైరల్‌కు.. సంచలన కామెంట్స్‌కు కేరాఫ్. అలాంటిది మరోసారి మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మల్లారెడ్డి అసెంబ్లీ లాబీలో మాట్లాడారు. గతంలో ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే.. అప్పుడు ఐటీ అధికారులు తన ఇంట్లో డబ్బులున్న గదినే చూడలేదని అన్నారు. అవే డబ్బులను ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నా అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

అంతేకాదు మేడ్చల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది తానే డిసైడ్ చేస్తానని అన్నారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్‌ అభ్యర్థిని కూడా తానే డిసైడ్‌ చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్‌కు టికెట్‌ ఇప్పించానని అన్నారు. మేడ్చల్‌ కాంగ్రెస్‌లో గ్రూప్‌ గొడవలు తామే సృష్టిస్తున్నామంటూ ఆసక్తికార వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్‌ అధిష్టానంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పారు. దాంతో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్‌రెడ్డిపై తొడ కొట్టిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధి గురించి ప్రజలు మర్చిపోయారని.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలే గుర్తుపెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ అనగానే నా మంత్రి పదవి ఊడిపోతుందని చర్చించుకున్నారని చెప్పారు. తెలంగాణ యాసపై తనకు ఎనలేని ప్రేమ ఉందని.. ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని తెలిపారు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు.


Next Story