హరీశ్‌రావు పట్ల మైనంపల్లి వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్

తిరుమల పర్యటనలో మంత్రి హరీశ్‌రావుపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2023 12:23 PM GMT
Minister KTR,  Mynampally,  Harish Rao,

హరీశ్‌రావు పట్ల మైనంపల్లి వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్

తిరుమల పర్యటనలో మంత్రి హరీశ్‌రావుపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం ఏంటనే విధంగా మాట్లాడారు. ఆయన అంతు చూసే వరకు వదలబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మైనంపల్లి. దాంతో..మైనంపల్లి వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌ నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కూడా స్పందించారు.

మంత్రి హరీశ్‌రావు పట్ల మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తామంతా హరీశ్‌రావు వెంట ఉంటామని చెప్పారు. పార్టీ ఆవిర్బావం నుంచి హరీశ్‌రావు పార్టీతోనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి మూలస్తంభం లాంటివారని అన్నారు కేటీఆర్. హరీశ్‌రావు అంతుచూస్తామని మైనంపల్లి మాట్లాడటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా.. మైనంపల్లి హన్మంతరావుకి బీఆర్ఎస్‌ ఈసారి కూడా ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. కానీ.. ఆయన తనతో పాటు తన కుమారుడు రోహిత్‌ కూడా మెదక్‌ టికెట్‌ ఇస్తారని ఆశించారు. కానీ.. అది జరగదని తెలిసి హరీశ్‌రావుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇద్దరికీ టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్రులుగా అయినా బరిలోకి దిగుతామని.. హరీశ్‌రావు సంగతి తేలుస్తామంటూ ఫైర్ అయ్యారు. కోవిడ్ సమయంలో తన కొడుకు రోహిత్ ఎంతో సేవ చేశాడని.. దాదాపు రూ.8 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేశాడని చెప్పారు. అయితే.. బీఆర్ఎస్‌ మైనంపల్లికి టికెట్‌ కేటాయించింది. పార్టీలో ఉండి పోటీ చేస్తారా? లేదంటే కొడుకుతో పాటు ఆయన కూడా స్వతంత్రులుగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాక.. సీఎం కేసీఆర్‌ కూడా మైనంపల్లికి ఇష్టం ఉంటేనే పార్టీ తరఫున పోటీ చేయాలని.. లేదంటే అది ఆయన ఇష్టమని చెప్పారు.

Next Story