ధర్మవరం వస్తా.. మీ ఇంటికొస్తా.. ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసీ సవాల్

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాడిపత్రికి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  7 July 2023 7:53 AM GMT
JC Prabhakar, MLA Kethireddy, MLA Peddareddy

ధర్మవరం వస్తా.. మీ ఇంటికొస్తా.. ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసీ సవాల్

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏడాదిన్నర చీనా తోటకు పంట భీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబాయ్‌.. అబ్బాయ్‌పై జేసీ ప్రభాకర్‌ మండిపడ్డారు. పంటల భీమాలో రైతులకు న్యాయం జరగలేదని.. వైసీపీ నేతలకే న్యాయం జరిగిందన్నారు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాడిపత్రికి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితూ ఊరుకోమని ఫైర్ అయ్యారు. ధర్మవరం వస్తా... నీ ఇంటి దగ్గరకు వస్తా.. ఏం చేస్తావ్ అంటూ సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి లండన్‌ క్లబుల్లో గ్లాసులు కడిగేవారని ఆ విషం గుర్తుంచుకోవాలని జేసీ అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి.. పెద్దారెడ్డి చీనా తోటకు వస్తున్నా దమ్ముంటే నన్ను ఆపుకోండంటూ విరుచుకుపడ్డారు. చీనా తోటలో పంట లేకుండానే పంట నష్టం బీమా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రూ.13.89 లక్షలు కొట్టేశారని ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆరోపణలు చేశారు. మొక్కలు నాటిన ఏడాదికే పెద్దారెడ్డికి పరిహారం అదింది అన్నారు. ఎమ్మెల్యేకు భయపడే అధికారులు కూడా పరిహారం అందిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Next Story