పవన్ కల్యాణ్ వెన్నంటి ఉండే అతను బీజేపీలో చేరనున్నారా..?
Janasena Nadendla Manohar .. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే కొనసాగుతుంటాయి. ప్రస్తుతం గ్రేటర్ ఎన్
By సుభాష్ Published on 20 Nov 2020 12:24 PM ISTతెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగానే కొనసాగుతుంటాయి. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సమరం అంతా ఇంతా కాదు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో జనసేన కూడా పోటీకి సిద్దమని జనసేన నేత పవన్ కల్యాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో బలోపేతమై రాష్ట్ర పగ్గాలు చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురి ఇతర పార్టీలను వీడి బీజేపీలో చేరుతుండగా, తాజాగా జనసేనలో కూడా ఓ నేత బీజేపీలో చేరుతారని పుకార్లు షికార్లు అవుతున్నాయి. అయితే జనసేన పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జవన్ కల్యాన్‌తో పాటు ఆయన వెన్నంటి ఉండే నేత నాదేండ్ల మనోహర్. అతనే పార్టీ వెనుకుండి నడిపించిన ఆయన కొంత కాలంగా మౌనండి ఉండిపోయారు. ఎక్కడ కూడా కనిపించడం లేదు. నాదేండ్ల ఎందుకు మౌనంగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటే.. పార్టీని నడిపించాల్సిన మనోహర్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన జనసేన పార్టీ.. ఆ తర్వాత కోలుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఇబ్బందులు కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే మిగితా నేతలు కూడా పార్టీని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు మదనపడుతున్నారు. పార్టీ విషయాల్లో నేతలు అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. చివరికి పార్టీకి వెన్నంటి ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా పార్టీ విషయంలో సైలెంట్‌గా ఉండటంతో పార్టీ పరిస్థితి అయోమయంగా మారిందని జనసైనికులు అంటున్నారు.
కీలకమైన విషయాల్లో ప్రెస్‌నోట్లు మీడియాకు విడుదలవుతున్నాయే తప్ప అటు పవన్ కల్యాణ్ గానీ, ఇటు నాదెండ్ల మనోహర్ గానీ మాట్లాడటం లేదని, పవన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు కనుక పార్టీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడైన మనోహర్ అయినా బయటకు రాకుండా సైలెంట్‌గా ఉంటున్నారని, పార్టీ అంశాల్లో పెద్దగా స్పందించకపోవడంపై పార్టీలు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
పార్టీ విషయంలోనూ, అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ నాదెండ్ల మనోహర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జనసేన పార్టీ బలహీన పడటం, గత ఎన్నికల్లో ఒక్క సీటు తప్ప ఎక్కడ కూడా గెలవకపోవడం వంటి అంశాల కారణంగానే మనోహర్ పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటన్నింటిని పరిశీలిస్తే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నేతలు.
ఎన్నికల ముందు పార్టీని నడిపించిన నాదెండ్ల మనోహర్ ఆ తర్వాత పార్టీ విషయంలో అంతగా పట్టించుకోకపోవడం, అధినేత లేని సమయంలో కనీసం నేతలకు అందుబాటులోకి రాకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఆయన బీజేపీలో చేరాలని భావిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ విషయంలో అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలంటున్నారు జన సైనికులు.