ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లలేదు కానీ..రష్యా-ఉక్రెయిన్ వార్‌ను ఆపుతారా?: ఒవైసీ
ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 5:00 PM ISTహైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. మణిపూర్ చెలరేగిన హింస గురించి అందరికీ తెలిసిందే అన్నారు. రిజర్వేషన్ల కోసం రేగిన రగడలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కానీ... ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లో పర్యటించలేదని చెప్పారు. కానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు చేశారు. ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. మహిళలపై అత్యాచారాలు సహా హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మణిపూర్‌కు ప్రధాఇ మోదీ ఎందుకు వెళ్లడం లేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ ఇంకా మాట్లాడుతూ.. "మా మోదీ జీ. ఏం చేసారు? మణిపూర్ లో దాదాపు ఒక సంవత్సరం నుండి హింస చెలరేగుతోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు, జెలెన్‌స్కీ కి NSA పంపారు. మోదీ జీ, ఇంట్లో మంటలు.. ఆపండి. అక్కడ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది కానీ ఇంటి గురించి చింతించకండి ఉక్రెయిన్‌లో యుద్ధం జరగకూడదు" అసుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మదర్సాలు తమ విద్యార్థులకు ఏకే-47 రైఫిళ్లను ఉపయోగించడంపై శిక్షణ ఇస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముస్లింలపై ఇంత ద్వేషం ఎందుకని ఒవైసీ ప్రశ్నించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ముస్లింలు త్యాగాలు చేశారని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు మదర్సాలు 'ఫత్వా' జారీ చేశాయని అసదుద్దీన్ తెలిపారు. "మీకు ఇస్లామోఫోబియా వ్యాధి ఉందంటూ బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.