హైదరాబాద్:  ఇక..విడతలవారిగా ప్రగతి భవన్‌ను ముట్టడించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకరిద్దరూ  కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు దూసుకువస్తున్నారు. ప్రగతి ఇరువైపులా ట్రాఫిక్‌ ఆగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసుల కళ్లుగప్పి ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. మరో వైపు..ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ సీనియర్‌ నేత అంజన్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసీఆర్ ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి ట్వట్  చేశారు. మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కేసీఆర్‌ ఖబడ్దార్‌ అంటూ ట్వట్ చేశారు రేవంత్. అంజన్ యాదవ్, రాముల నాయక్‌ అక్రమ అరెస్ట్ లు ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే అర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

పారిడైజ్ నుంచి ప్రగతి భవన్ వైపు ట్రాఫిక్ దృశ్యాలు

T7

T6

T5

T4

T3

T2

T1

Traficjam

కాంగ్రెస్ నేతల అరెస్ట్ దృశ్యాలు

Anjan1

Anjan2

Anjan3

శ్రీధర్ బాబు హౌజ్ అరెస్ట్

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి శ్రీధర్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. దోమలగూడలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

రేవంత్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

రేవంత్ రెడ్డి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రగతిభవన్ ముట్టడి పిలుపు నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న అన్ని హోటల్స్ చెక్‌ చేస్తున్నారు. రేవంత్ అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయినా..రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో తెలియరావడంలేదు. పోలీసులు మాత్రం టెన్షలో ఉన్నట్లు సమాచారం.

REVANTHREVANTH 3Revanth 4Revanth 5Revanth 6

కాంగ్రెస్‌ ముఖ్య నేతలు హౌజ్ అరెస్ట్
ఇక ఈ రోజు ప్రగతిభవన్‌ ముట్టడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలను పీఎస్‌లకు తరలిస్తున్నారు. ముఖ్య నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ కొండా వివ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలను గృహనిర్బంధంలో ఉంచారు. Shabbir1Shabbi2

ఈ రోజు బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో మెట్రో రైలు ఆగదని అధికారులు చెప్పారు. భద్రతా కారణాలు రీత్యా ఆగదన్నారు. అయితే..బేగంపేట్ మెట్రో స్టేషన్ ప్రగతి భవన్‌కు సమీపంలో ఉంటుంది. దీంతో..ఈ రోజు స్టేషన్‌ మూసేశారని టాక్‌ కూడా వినిపిస్తుంది.

Metro STATION BEGUMPET

METRO BEGUM PET

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.