షాద్‌నగర్‌: శంషాబాద్‌ సమీంపలో జస్టిస్‌ ఫర్‌ దిశపై హత్యాచారం, హత్య కేసు నిందితుల కస్టడీ కోరుతూ.. పోలీసులు షాద్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఐడు రోజుల క్రితం జస్టిస్‌ ఫర్‌ దిశపై నలుగురు హత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితులను పోలీసులు అరెస్టు చేసి చర్టపల్లి జైలుకు తరలించారు.

అయితే నిందితుల నుంచి మరిన్ని ఆదారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో షాద్‌నగర్‌ కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విచారణలో భాగంగానే పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు షాద్‌నగర్‌ కోర్టులో ఈ కస్టడీ పిటిషన్‌పై విచారణ సాగుతోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.