ఓ కానిస్టేబుల్‌ పోలీసుస్టేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న లచ్చయ్య (52) బుధవారం స్టేషన్‌లో ఎవరూ లేని సమయంలో బ్యారక్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 1990వ బ్యాచ్‌కు చెందిన లచ్చయ్య.. ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. లచ్చయ్య స్వగ్రామం జనగామ. విషయం తెలుసుకున్న స్టేషన్‌ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మాచారెడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సీఐకి ఆదేశించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.