జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు 34 మందిపై కేసు నమోదు
By సుభాష్ Published on 6 Oct 2020 7:09 PM ISTమాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ బారిన పడిన ఆయన.. హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం సోమవారం రాత్రి తాడిపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నుంచి కోలుకుని వచ్చిన ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎలాంటి అనుమతి లేకుండా స్వాగత కార్యక్రమం నిర్వహించారంటూ జేసీతో పాటు ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి, మరో 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడిపత్రిలో గత సంవత్సరం నుంచి 30 పోలీస్ యాక్టు అమల్లో ఉంది. అయితే ఏవైనా ర్యాలీలు, స్వాగత కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వాగతం పలికే కార్యక్రమానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, అందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story