ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 65,889 శాంపిళ్లకు పరీక్షలు చేయగా, అందులో 5,795 పాజిటివ్‌ కేసులు బయట పడ్డాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7 లక్షల 29వేల 307 నమోదు కాగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 6052కు చేరుకుంది. అలాగే కొత్తగా 33 మంది కరోనాతో మృతి చెందారు.

మృతి చెందిన వారు జిల్లాల వారిగా కృష్ణలో 6, ప్రకాశం 5, తూర్పు గోదావరి 4, విశాఖలో 4, అనంతపూర్‌లో 3, చిత్తూరులో 3, గుంటూరులో 2, నెల్లూరులో 2, పశ్చిమగోదావరిలో 2, కడపలో 1, విజయనగరంలో 1 చొప్పున మృతి చెందారు. ఇక యాక్టివ్‌ కేసులు 50,776 ఉండగా, డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 6,72,479 ఉంది.సుభాష్

.

Next Story