వైఎస్ జగన్‌ అనుకుంటే వెనక్కి తగ్గడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 2:05 PM GMT
వైఎస్ జగన్‌ అనుకుంటే వెనక్కి తగ్గడు..!

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అనుకున్నది సాధించారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్‌పై ముందుకు వెళ్లారు. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటి పనుల్లో 65వ ప్యాకేజీకి రివర్స్‌ టెండరింగ్ ఖరారైంది. 15.6శాతం లెస్‌కి మ్యాక్స్‌ ఇన్‌ ఫ్రా సంస్థ టెండర్ వేసింది. ఇదే సంస్థ చంద్రబాబు హయాంలో 4.8శాతం ఎక్సెస్‌కి టెండర్‌ దాఖలు చేసింది. ఒక్క ప్యాకేజీ రివర్స్ టెండరింగ్ విధానానికే ప్రభుత్వానికి రూ.58 కోట్లు ఆదా అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. . టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ. 292.02 కోట్లకు మ్యాక్స్ ఇన్ ఫ్రా పనులు దక్కించుకుంది. ఇప్పుడు ఇదే సంస్థ రూ. 231.47 కోట్లకు టెండర్ దక్కించుకుంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు భారీగా పెంచారని నిరూపితమయిందని వైఎస్ఆర్‌ సీపీ వర్గాలు అంటున్నాయి

Next Story