పట్టుపడితే విజయమే..శభాష్ ఫొగాట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 2:40 PM GMT
పట్టుపడితే విజయమే..శభాష్ ఫొగాట్

నూర్ -సుల్తాన్‌(కజకిస్తాన్‌): వినేశ్ ఫొగాట్ పట్టుకు ఒకే రోజు మూడు దేశాల కుస్తీ రాణులు విలవిలలాడి పోయారు. ఫొగాట్ పట్టు పట్టుకు ఇండోర్ స్టేడియంలో ఈలలు మోగాయి. ఈ రోజు ఫొగాట్‌కు మరిచిపోలేని రోజుగా మిగులుతుంది. బుధవారం ఒక్క రోజే ముగ్గురిని మట్టి కరిపించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో పాటు... ప్రపంచ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకుంది. రెండూ ఒకే రోజు జరగడంతో ఫొగాట్ ఆనంద పడి పోతుంది. ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌లో వినేశ్‌కు ఇదే తొలి పతకం. ఈ మెగాటోర్నీలో పతకం సాధించిన నాలుగో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఘనత సాధించారు. ‘రెపిచేజ్‌’లో భాగంగా ఒకే రోజు ఉక్రెయిన్‌కు చెందిన యులియా ,ఇక అమెరికాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్‌ సారా , గ్రీస్‌కు చెందిన ప్రివొలరిక్‌ లను తన పట్టుతో పడగొట్టింది ఫొగాట్. ఆల్ ది బెస్ట్ వినేష్ ఫొగాట్.

Next Story
Share it