ఆ రేపిస్ట్ ఫాదర్ ను పోప్ బహిష్కరించేశారు..!

By సుభాష్  Published on  2 March 2020 3:20 PM GMT
ఆ రేపిస్ట్ ఫాదర్ ను పోప్ బహిష్కరించేశారు..!

లైంగిక వేధింపులు ఏ స్థాయిలోనూ క్షమించరాని నేరాలుగా పరిగణిస్తారు. అలాంటిది ఆ చర్చి ఫాదర్ ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. నమ్మిన వారిని మోసం చేశాడు..! ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అలాంటి వ్యక్తిని పోప్ ఫ్రాన్సిస్ బహిష్కరించారు. లైంగిక వేధింపులను ఎటువంటి స్థాయి లోనూ సహించమని చెప్పారు. పిల్లలను లైంగికంగా వేధించడం చాలా తీవ్రమైన నేరంగా పోప్ పరిగణించారు.

కేరళకు చెందిన చర్చ్ ఫాదర్ ను అన్ని బాధ్యతల నుండి తొలగించేశారు. సైరో మలబార్ చర్చి ఫాదర్ రాబిన్ వడక్కుమ్చెరి చేసిన పనులకు అతన్ని అన్ని విధుల నుండి బహిష్కరించారు. 16 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు రాబిన్. 2017 లో అతడిపై అభియోగాలు నమోదైన వెంటనే పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పుడే అతడిని విధుల నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్న రాబిన్ కు ప్రీస్ట్ గా పనిచేసే ఎటువంటి హక్కులూ లేవని పోప్ తేల్చేశారు. అతడి కేసును విచారించిన కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షను, 3 లక్షల రూపాయల జరిమానాను విధించింది.

Next Story