ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: జర్మనీ ఛాన్సలర్‌తో మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 2:38 PM GMT
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: జర్మనీ ఛాన్సలర్‌తో మోదీ

ఢిల్లీ: టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో భారత్, జర్మనీ కలిసి పని చేస్తాయని ప్రధాని మోదీ చెప్పారు. రెండు రోజుల పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాలు 11 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పౌర విమానయానం, సముద్ర సాంకేతికత, అంతరిక్షం తదితర రంగాలకు సంబంధించి సంతకాలు జరిగాయి. 2022 నవ భారత నిర్మాణానికి జర్మనీ సాంకేతికత ఎంతో మేలు చేస్తుందన్నారు ప్రధాని మోదీ.

Image

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తుకు ఎంతో మేలుచేస్తాయన్నారు మెర్కెల్. 5జీ, కృత్రిమ మేధస్సుపై కలిసి పని చేస్తామన్నారు జర్మనీ ఛాన్సలర్‌.

Image

ImageNext Story