ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంస..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 12:26 PM GMT
ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంస..

అమరావతి: ఏపీ పోలీసుల పనితీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. గుజరాత్‌లోని వడోదరలో పోలీస్‌ టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. అందులో ఏపీ పోలీస్‌ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్పందన, వీక్లీ ఆఫ్‌ సిస్టమ్‌, ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్, ఫేస్‌ రికగ్నైజేషన్‌, ఈ విజిట్‌, డీజీ డ్యాష్‌ బోర్డు, లాక్ట్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లతో ఏపీ పోలీసులు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. పోలీసు టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ తిలకించారు. ఈ సందర్భంగా ఏపీ స్టాల్‌ వద్ద ప్రత్యేక పోలీస్‌ విధానంపై ప్రధాని మోదీ ఆసక్తి కనబరిచారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ సిస్టమ్‌పై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ల పనితీరును ప్రశంసిస్తూ వాటిపై పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని ప్రధాని మోదీ కోరారు.Next Story
Share it