దీపావళికి ముందుగానే ప్రజలు ఆశీర్వదించారు: ప్రధాని మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 24 Oct 2019 8:36 PM IST

దీపావళికి ముందుగానే ప్రజలు ఆశీర్వదించారు: ప్రధాని మోదీ

ఢిల్లీ: మహారాష్ట్ర, మర్యానా ఎన్నికల ఫలితాలు తరువాత ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో విజయం అక్కడ సీఎంల పనితీరుకు నిదర్శనమన్నారు. తమ పాలనకు ప్రజలు మంచి మార్క్‌లు వేశారని చెప్పారు. 50 ఏళ్ల తరువాత మహారాష్ట్రలో ఓ సీఎం 5 ఏళ్లు ఉన్నారని..ఫడ్నవీసే మళ్లీ తమ సీఎం అని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంకా మంచి పనులు చేయడానికి ప్రజలు తమకు అవకాశం కల్పించారన్నారు. పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేకున్నా ఖట్టర్‌, ఫడ్నవీస్ మంచి పాలన అందించారని కొనియాడారు. హర్యానాలో తమ ఓటు శాతం పెరిగిందన్నారు.

Next Story