టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిత్ర పరిశ్రమలో జయప్రకాశ్‌ తనకంటై మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, నాటకాల నుంచి సినిమాల వరకు ఎన్నో పాత్రల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన జీవన శైలిలో ఎన్నో మరుపురాని ఘటనలున్నాయని పేర్కొన్నారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్‌ చేశారు. జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని అని అని ట్వీట్‌ చేశారు.

జయప్రకాశ్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: అమిత్‌ షా

అలాగే కేంద్ర హోశాఖ మంత్రి అమిత్‌ షా కూడా జయప్రకాశ్‌రెడ్డి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి గారి అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది.ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.. అంటూ ట్వీట్‌ చేశారు.

సుభాష్

.

Next Story