పెట్టుబడులకు భారత్ స్వర్గధామం- సౌదీలో పీఎం మోదీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 6:13 PM GMT
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం- సౌదీలో పీఎం మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ అరేబియా పర్యటన ప్రారంభమైంది. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీకి చేరుకున్న మోదీ ఘనస్వాగతం లభించింది. స్వాగత సత్కారాల అనంతరం అధికార, అనధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. తొలి రోజు సౌదీ రాజు మహ్మద్ బిన్ అబ్దుల్లాజీజ్ అల్ సౌద్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఘనవిజయం సాధించడంపై సౌదీ రాజు అభి నందనలు తెలిపా రు. సౌదీ-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. సౌదీ యువరాజును కూడా కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరచడంపై సమా లోచనలు జరిపారు. అంతకుముందు సౌదీ ప్రభుత్వంలోని టాప్ మినిస్టర్లతో సమావేశమయ్యారు. ఇంధన, వ్యవసాయ, కార్మిక రంగాలపై చర్చించారు. మహారాష్ట్ర-రాయ్‌ఘర్‌లో నిర్మించతలపెట్టిన పశ్చిమ తీర రిఫైన రీ ప్రాజెక్టుపై సమాలోచనలు జరిపారు. ఇందులో సౌదీ దిగ్గజ ఆయిల్ కంపెనీ ఆరామ్ కో, యూఏఈకి చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ, భారతదేశానికి చెందిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నా యి.

పెట్టుబడులకు భారతదేశం స్వర్గధామమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల ని సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాటం కొనసాగిద్దామన్న మోదీ, కీలక రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 31 వరకు మోదీ సౌదీ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా సౌదీ-భారత్ మధ్య దాదాపు 12 ఒప్పందాలు జరిగే అవకాశముంది. ఇందులో పునరుత్పాదక ఇంధనం, రక్షణ, పౌర విమానయాన రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి డీల్స్ కుదరనున్నాయి. ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. 2016లో మోదీ తొలిసారి సౌదీకి వెళ్లారు. సౌదీతో బంధాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు పెట్టుబడులు ఆకర్షించడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మనదేశానికి వచ్చారు. పెట్రో కెమికల్స్, మౌలిక సదుపా యాలు, మైనిం గ్ రంగాల్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించారు.

Next Story