ఓటు వేయండి : న్యూస్‌మీటర్‌ను గెలిపించాల్సిన బాధ్యత మీదే.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 5:51 AM GMT
ఓటు వేయండి : న్యూస్‌మీటర్‌ను గెలిపించాల్సిన బాధ్యత మీదే.!

ది గ్లోబల్ ఫ్యాక్ట్ అవార్డ్స్ 2020 లో భాగంగా ఫైనల్ చేరిన నాలుగు వార్తాసంస్థల్లో 'న్యూస్ మీటర్' కూడా ఒకటి. ఈ ఘనతను సాధించినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్(ఐసిఎఫ్ఎన్) ఈ అవార్డులను అందిస్తుంది. ఐసిఎఫ్ఎన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలకు ప్రతి ఏడాది అవార్డులను అందిస్తూ ఉంటుంది. గ్లోబల్ ఫ్యాక్ట్ అంటూ ప్రతి ఏడాది జూన్ నెలలో నిర్వహించే ఈ ప్రోగ్రామ్ లో విజేతలను ప్రకటిస్తారు.

ఇటీవలే 'న్యూస్ మీటర్' ఫ్యాక్ట్ చెకింగ్ లో ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్ వర్క్ సిగ్నేటరీని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 77 ఐసిఎఫ్ఎన్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్లలో స్థానం సంపాదించింది. భారత్ కు చెందిన 13 వెబ్ సైట్లలో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తున్న రెండో వెబ్ సైట్ గా ఐసిఎఫ్ఎన్ గుర్తింపు సంపాదించుకుంది.

జూన్ 22(సోమవారం), గ్లోబల్ ఫ్యాక్ట్-7 అన్నది వర్చువల్ గా నిర్వహించనున్నారు. వర్చువల్ గా నిర్వహిస్తూ ఉండడం మొదటిసారి. ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా ఐసిఎఫ్ఎన్ గ్లోబల్ ఫ్యాక్ట్ చెక్ అవార్డులను ప్రకటించనుంది. most bizarre, most creative, best correction అనే కేటగిరీలలో అవార్డులను ప్రకటించనుంది.

న్యూస్ మీటర్ most bizarre కేట‌గిరీలో నామినేషన్ ను అందుకుంది.

https://www.poynter.org/fact-checking/2020/squirrels-pop-songs-and-king-cobras-cast-your-vote-for-the-global-fact-7-awards/

17 దేశాలకు చెందిన 22 ఆర్గనైజేషన్స్ కు సంబంధించిన 43 ఫ్యాక్ట్ చెక్ స్టోరీలను ఐసిఎఫ్ఎన్ నామినేషన్స్ లో ఉంచింది. ఐసిఎఫ్ఎన్ డైరెక్టర్ బేబర్స్ ఆర్సెక్, అసోసియేట్ డైరెక్టర్ క్రిస్టినా తార్దగిలా, ప్రోగ్రామ్ మేనేజర్ ఫెర్డి ఆజ్సాయ్, రిపోర్టర్ హారిసన్ మంటాస్ ఒక్కో ఫ్యాక్ట్ చెకింగ్ స్టోరీకి 1-5 వరకూ రేటింగ్ ఇచ్చారు. గరిష్టంగా 5 రేటింగ్ పాయింట్లను అందుకున్నారు.

సాధారణ ప్రజలు కూడా ఓట్ వేయడానికి అవకాశం కల్పించనున్నారు. సోమవారం జూన్ 22న ఓటింగ్ మొదలుకానుంది. జూన్ 24 అర్ధరాత్రి వరకూ ఓట్ వేసే సౌలభ్యం ఉంటుంది. జూన్ 25న ఓట్లను లెక్కించనున్నారు. జూన్ 26న శుక్రవారం నాడు విజేతలను ప్రకటించనున్నారు. ఓటింగ్ ఓపెన్ అవ్వగానే ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfFDdjL7i_QJXSW3ge7U0BDCaAviIaW9QTWv7ocFvR6sUdeUQ/closedform

మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము.

Next Story