న్యూస్‌మీట‌ర్‌కు అంత‌ర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వ‌ర్కింగ్ గుర్తింపు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 10:45 AM GMT
న్యూస్‌మీట‌ర్‌కు అంత‌ర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వ‌ర్కింగ్ గుర్తింపు

ప్రియమైన న్యూస్ మీటర్ పాఠకులకు,

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తప్పుడు వార్తలు, ఫోటోలు.. నిజం కంటే అబద్దాలే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి ప్రముఖులు కూడా ఈ త‌ప్పుడు వార్తల బారిన పడి తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. అందుకే మన పాఠకుల కోసం నిజ నిర్ధారణ అంటూ ఓ ఫీచర్ ను తీసుకుని వస్తున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజమా కాదా అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. న్యూస్ మీటర్ చేస్తున్న ఈ పనిని ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ (IFCN) కూడా గుర్తించింది. హైదరాబాద్ కు చెందిన న్యూస్ మీటర్ సంస్థ ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తూ గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా IFCN వెరిఫై చేసిన 77 వెబ్ సైట్ల లిస్టులో చేరింది. భారత్ కు చెందిన 13 వెబ్ సైట్లలో న్యూస్ మీటర్ కూడా చేరింది.

సిల్వర్ ను స్కోర్ చేసిన న్యూస్ మీటర్.. తెలుగు రాష్ట్రాల్లో IFCN వెరిఫై చేసిన రెండో వెబ్ సైట్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ది ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్(IFCN) అన్నది ట్రెండ్స్ మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. ఫ్యాక్ట్ చెకింగ్ మీద దృష్టి సారిస్తూ ఉంటుంది. ట్రైనింగ్ అందిస్తూ ప్రతి సంవత్సరం ఒక కాన్ఫరెన్స్ ను 'గ్లోబల్ ఫ్యాక్ట్' పేరుతో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. IFCN ముఖ్య ఉద్దేశం నిజాలను ప్రజలకు చేరవేయడమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్ట్ చెకర్స్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ.. నిజాలను అందిస్తూ ఉంటుంది.

నిజనిర్ధారణ ఎప్పటికప్పుడు చేస్తూ.. లీగల్ గా రిజిస్టర్ అయిన సంస్థలకు IFCN సిగ్నేటరీ స్టేటస్ ను అందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎప్పటికప్పుడు నిజ నిర్ధారణ చేసే సంస్థలకు ఈ గుర్తింపు లభిస్తుంది. 31 నిబంధనల ప్రకారం సమీక్షకులు అప్లికేషన్ ని పరిశీలించి వారి అర్హతను తెలుపుతారు. అర్హులుగా సూచించిన వారిని IFCNబోర్డు వారు పరీక్షించి ఒక నిర్ధారణకు వస్తారు. పారదర్శకత కలిగిన సంస్థ కావడం వలన న్యూస్ మీటర్ కు ఈ గుర్తింపు లభించింది.

ఇండిపెండెంట్ న్యూస్ ఆర్గనైజేషన్ అయిన న్యూస్ మీటర్ చోటుచేసుకుంటున్న ఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుండి సరైన సమాచారాన్ని స్వీకరిస్తూ.. ప్రజల అపోహలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ ఉన్నాం. వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను వెరిఫై చేసి.. నిజమేమిటో అందరికీ అందిస్తూ వస్తున్నాం.

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న సమయంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, వీడియోలు, టెక్స్ట్ మెసేజీలు వైరల్ అవుతూ వచ్చాయి. వీటిపై ఎప్పటికప్పుడు నిజ నిర్ధారణ చేస్తూ సరైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ వస్తున్నాం.

తెలుగు, ఇంగ్లీష్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కు బి.ఎన్. సత్య ప్రియ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ చెక్ టీమ్ న్యూస్ మీటర్ వెబ్ సైట్ లో IFCN బోర్డు సూచించిన నిజ నిర్ధారణ పద్దతులను తూచా తప్పకుండా పాటిస్తూ నిజ నిర్ధారణ ఆర్టికల్స్ ను రాస్తున్నారు. వీడియో రూపంలో కూడా నిజ నిర్ధారణ వార్తలు అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము.

IFCN బోర్డు సూచనలను పాటిస్తూ సరైన సమాచారం ప్రజలకు చేరవేస్తూ ఉన్నామని ఫిఫ్త్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ MR. భరణి కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్క న్యూస్ మీటర్ పాఠకులకు ధన్యవాదాలు చెబుతున్నాము. మీ మద్దతు ఎప్పటిలాగే కొనసాగాలని కోరుతున్నాము.

సామ్రాట్‌

న్యూస్ ఎడిట‌ర్‌

న్యూస్‌మీట‌ర్ తెలుగు

Next Story