ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి

బంగ్లాదేశ్‌ లో భారీ పేలుడు సంభవించింది. అక్రమ నిర్వహణలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేడుడు సంభవించి 13 మంది మృతి చెందగా, మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఢాకా శివారు  కెరాణీ గంజ్‌లోని ప్లాస్టిక్‌ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పని చేస్తోన్న 13 మంది మరణించారు.. నజ్రుల్‌ ఇస్లాం అనే వ్యక్తికి చెందిన ఈ కంపెనీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ ప్లేట్లూ, కప్పులను తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో మొత్తం 300 మంది  కార్మికులు షిప్టుల వారిగా పని చేస్తారు. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించించడంతో కార్మికులు ఒక్కసారిగా  షాక్‌కు గురయ్యారు. ఈ పేడులు జరిగిన  సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు పెట్టారు. ఫ్యాక్టరీలో భారీ మొత్తంలో మంటలు వ్యాపించాయి. ఆ మంటల దాటికి బయటకు వెళ్లలేక మంటల్లోచిక్కుకుని మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చేపట్టి, విచారణ చేపడుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.