టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. కంప్యూటర్ యుగంలో నూతన సాంకేతికతల ఆవిష్కరణ వేగవంతమవుతోంది. తాజాగా టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేసే పరిణామం చోటు చేసుకుంది. గూగుల్ కంపెనీ తాము క్వాంటమ్ సుప్రమసీని సాధించామని ప్రకటించింది. సూపర్ కంప్యూటర్ చేయలేని పనిని క్వాంటమ్ కంప్యూటర్స్‌ సాయంతో పూర్తి చేశామని, అత్యంత క్లిష్టమైన సమస్యను సెకన్లలో పరిష్కరించామని గూగుల్ కంపెనీ పేర్కొంది.. ఐతే, పరిశోధనా పత్రాన్ని టెక్నాలజీ సహచరులు పరిశీలించాల్సి ఉంది.

క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే?

క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే డెస్క్‌టాప్‌లానో, ల్యాప్‌టాప్‌లానో ఉండవు. క్లుప్తంగా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్స్ సీపీయూల సమూహం. క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ మెకానిక్స్‌ పై ఆధారపడి పని చేస్తాయి. క్వాంటమ్ బిట్స్‌ రూపంలో ప్రాసెస్ చేస్తాయి. క్వాంటమ్ బిట్స్‌నే సంక్షిప్తంగా క్యూబిట్స్ అంటారు. ఈ విధానంలో 1, 0 లను ఒకేసారి ప్రాసెస్ చేయవచ్చు. సంప్రదాయ కంప్యూటర్లలో ఒక సమయంలో 1, 0 లలో ఏదో ఒకదానిని మాత్రమే ప్రాసెస్ చేస్తాయి. పైగా ఇచ్చే ఇన్‌పుట్స్ పెరుగుతున్నా కొద్దీ సమస్యను పరిష్కరించడం సంప్రదాయ కంప్యూటర్లకు కష్టమవుతుంది. ప్రపంచంలోనే శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఒక సెకన్‌లో లక్షా 48 వేల ట్రిలియన్ ఆపరేషన్స్ చేస్తుంది. అందుకుగాను 9 వేల ఐబీఎం సీపీయూలను నిర్దేశిత పద్ధతిలో అనుసంధానించాల్సి ఉంటుంది. కానీ, క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పని చేసే క్వాంటమ్ కంప్యూటర్లు పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తాయి. వాస్తవానికి 1990లలోనే క్వాంటమ్ కంప్యూటర్స్‌ ఆవిష్కరణ దిశగా ప్రయత్నాలు జరిగాయి. 2011లో క్వాంటమ్ కంప్యూటర్లు ఉనికిలోకి వచ్చాయి. కెనెడా కంపెనీ డి-వేవ్ సిస్టమ్స్ క్వాంటమ్ కంప్యూటర్ ను తయారు చేసింది.

క్వాంటమ్ కంప్యూటర్ తో ఉపయోగాలు

సంప్రదాయ సూపర్ కంప్యూటర్ల వేగం, సామర్థ్యానికి పరిమితిలుంటాయి. అంతేకాకుండా సూపర్ కంప్యూటర్లలో పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేసి అవసరమైన సమాచారాన్ని పొందడం చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను క్వాంటమ్ కంప్యూటర్ పరిష్కరించడమే కాకుండా వేగవంతంగా పని పూర్తి చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్లలో మేజర్ అడ్వాంటేజ్ దాని వేగం.

గూగుల్ సాధించిందేంటీ..?

ఏకకాలంలో 1, 0 లను ప్రాసెస్ చేయడాన్నే క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు. దీనివల్ల కంప్యూటర్ పనివేగం పెరుగుతుంది. ఫలితంగా కేవలం 100 క్యూబిట్లతోనే అతిపెద్ద సమస్యను పరిష్కరించవచ్చు. మిలియన్ల సంఖ్యల క్రమాన్ని రూపొందించ డానికి గూగుల్ కంపెనీ 53 క్యూబిట్ ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు పరిశోధనా పత్రాల్లో పేర్కొన్నారు. ఈ సంఖ్యలు రాండమ్ గా ఉన్నప్పటికీ, అవి గూగుల్ సృష్టించిన అల్గారిథంకు అనుగుణంగా ఉంటాయి. గూగుల్ కు చెందిన సైకామోర్ అనే క్వాంటం కంప్యూటర్ ‘క్వాంటమ్ సుప్రమసీ సాధించినట్లు ప్రకటించుకుంది. అది 200 సెకన్లలో మిలియన్ల సంఖ్యల క్రమాన్ని పనిని పూర్తి చేసింది. అదే పని సూపర్ కంప్యూటర్ పూర్తి చేయడానికి 10 వేల సంవత్సరాలు పడుతుంది.

ఇది నిజంగా ముఖ్యమైన ఆవిష్కరణనేనా?

ఇప్పటివరకు చూస్తే ఇది ముఖ్యమైన ఆవిష్కరణలానే కనిపిస్తోంది. అయితే, ప్రతి సవాల్ ను క్వాంటమ్ కంప్యూటర్ సులువుగా పరిష్కరిస్తుందని అనుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐబీఎం , ఇతర ప్రైవేట్ సంస్థలు క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్‌లను కలిగి ఉన్నప్పటికీ, అందులోనూ లోపాలున్నాయి. పైగా, సూపర్ కంప్యూటర్లలో సమస్యలు ఉన్నప్పటికీ అవి మరింత సమర్థవంతంగా పని చేసేలా నూతన సాంకేతిక ఆవిష్కరణలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. అంతేకాకుండా, క్వాంటమ్ ఆధిపత్యం అనే మాటలోని వాస్తవికతను కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, అతిక్లిష్ట సమస్యలను క్వాంటమ్ కంప్యూటర్లు పరిష్కరించగలవని గూగుల్ సరికొత్త ఆవిష్కరణ నిరూపిస్తోంది. 2020 నాటికి 5000 క్యూబిట్ సిస్టమ్ ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నామని డి-వేవ్ సిస్టమ్ ప్రకటించింది. ఇప్పటికే నాసా వద్ద డి-వేవ్ సిస్టమ్స్ కంపెనీకి 1000 క్యూబిట్ సిస్టమ్ ఉంది. బీజింగ్ లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించ డానికి తాము తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్లను ఉపయోగించుకుంటున్నారని డి-వేవ్ సిస్టమ్స్ పేర్కొంది.

ఆన్ లైన్ బ్యాంకింగులో క్వాంటమ్ కంప్యూటర్ల అవసరం

క్వాంటం కంప్యూటింగ్ వాడకం, ఎన్ క్రిప్షన్ కోడ్ లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనేది విమర్శకుల ప్రశ్న. బ్యాంకింగ్ గ్రేడ్ ఎన్ క్రిప్షన్ ను విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం. గూగుల్ సాధించిన క్వాంటమ్ ఆధిపత్యంపై సైద్ధాంతిక కంప్యూటర్ శాస్త్రవేత్త స్కాట్ ఆరోన్సన్ తన అభిప్రాయా న్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుత ఎన్ క్రిప్షన్ ప్రమాణాలకు అనుగుణంగా క్వాంటమ్ కంప్యూటర్లు పని చేయాలంటే, వేల సంఖ్యలో క్యూబిట్లు సంపూర్ణస్థాయిలో లాజికల్ గా పని చేయాల్సి ఉంటుందని స్కాట్ ఆరోన్సన్ పేర్కొన్నారు. ఇది జరగాలంటే లక్షల సంఖ్యలో క్యూబిట్లు కావాలి. ఇది కష్టసాధ్యం. సైకామోర్ 53 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఈ సంక్లిష్టతను అధిగమించలేదు.

భారతదేశం క్వాంటం కంప్యూటింగ్‌పై పనిచేస్తుందా?

భారతదేశంలో ఇంకా క్వాంటం కంప్యూటర్లు లేవు. 2018 లో, సైన్స్ & టెక్నాలజీ విభాగం క్వాంటం-ఎనేబుల్డ్ సైన్స్ & టెక్నాలజీ- క్వెస్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశోధనలను వేగవంతం చేయడానికి రాబోయే మూడేళ్ళలో రూ. 80 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. వచ్చే దశాబ్ద కాలంలో భారతదేశంలో క్వాంటం కంప్యూటర్‌ను నిర్మించాలనేది స్పష్టమైన ప్రణాళిక.

– రంజన్, సీనియర్ జర్నలిస్ట్

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort