తిరుపతి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2020 2:55 PM IST
తిరుపతి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పై తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌ వే పై పరిశీలనకు వెళ్లిన పైర్‌ ఇంజిన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. బెంగళూరు నుంచి 71 మంది ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కు సన్నద్దమవుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. విషయం గుర్తించిన అధికారులు వెంటనే ఇండిగో విమాన పైలెట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో విమానాన్ని ల్యాండ్ చేయలేదు. విమానం తిరిగి బెంగళూరుకు వెళ్లింది. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రన్‌వే పై ఉన్న పైర్‌ ఇంజన్‌ తరలింపు పనులను చేపట్టారు అధికారులు.

Next Story