పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..72 మంది స్వీయ నిర్బంధంలోకి

By రాణి  Published on  16 April 2020 4:21 PM IST
పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..72 మంది స్వీయ నిర్బంధంలోకి

ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా లక్షణాలు కనిపించాయి. అతనికి టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అధికారిక ప్రకటన చేశారు. ఈ విషయం తెలిసి అతను నివాసమున్న మాల్వియా నగర్ ప్రాంతంలో మరో 72 మంది సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్స్ కూడా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కాగా..కరోనా లక్షణాలున్న సమయంలో కూడా సదరు బాధితుడు పిజ్జా డెలివరీలు ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ఘటనతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 12 వేలు దాటగా..అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 414కు చేరింది.

Also Read : 20 లక్షలు దాటిన కరోనా కేసులు



Next Story