ఆ.. సినిమాలో న‌టించేది ఎవ‌రు..?  బాల‌య్యా..?  ప‌వ‌న్ క‌ళ్యాణా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 1:40 PM GMT
ఆ.. సినిమాలో న‌టించేది ఎవ‌రు..?  బాల‌య్యా..?  ప‌వ‌న్ క‌ళ్యాణా..?

నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 5నుంచి హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇదిలా ఉంటే... మరో సినిమాని నిర్మించేందుకు నిర్మాత‌... బాల‌య్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నార‌ట‌.

Image result for pink movie

ఇంత‌కీ.. ఆ సినిమా ఏంటంటే... బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ మూవీ రీమేక్. త‌మిళ్ లో ఈ సినిమాని అజిత్ చేశారు. అక్క‌డ కూడా విజ‌యం సాధించింది. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. తెలుగు రీమేక్ రైట్స్ బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ ద‌గ్గ‌ర ఉన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు బాల‌య్య‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే... బాల‌య్య ఇంకా త‌న నిర్ణ‌యం చెప్ప‌లేద‌ట‌. ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా త‌ర్వాత బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నారు బాల‌య్య‌. ఇది డిసెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

Related image

రీసెంట్ గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఈ రీమేక్ లో న‌టించ‌మ‌ని సంప్ర‌దించార‌ట‌. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ పాజిటివ్ గానే స్పందించార‌ట కానీ... ఇంకా ఏ విష‌యం చెప్ప‌లేద‌ట‌. దీంతో పింక్ తెలుగు రీమేక్ లో న‌టించేది బాల‌య్యా..? ప‌వ‌న్ క‌ళ్యాణా...? అనేది ఆస‌క్తిగా మారింది.

Next Story
Share it