హైదరాబాద్‌ 'కాలుష్యం'పై హైకోర్టులో పిల్‌ దాఖలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 1:07 PM GMT
హైదరాబాద్‌ కాలుష్యంపై హైకోర్టులో పిల్‌ దాఖలు..

హైదరాబాద్‌: మహా నగరంలో కాలుష్యంపై హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది. ఎమ్‌ ఆదిత్య అనే వ్యక్తి పిల్‌ దాఖలు చేశాడు. నగరంలో అధిక వాహనాల వల్ల శబ్ద, వాయు కాలుష్యం పెరుగుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్‌ వాదనలు వినిపించారు. జంట నగరాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల వల్ల విపరీతంగా శబ్ద కాలుష్యం వస్తోందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. శబ్ద, వాయు కాలుష్యం వల్ల మహిళలు గర్భస్రావం, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌ నగరంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మున్సిపల్‌ కమిషన్‌, డీజీపీ, రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్స్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వానికి కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 19కి హైకోర్టు వాయిదా వేసింది.

Next Story